
తలంటు పోసుకునేటప్పుడు షాంపూతో బండగా రుద్దేయడం సరికాదు. మాడును మునివేళ్లతో సున్నితంగా రుద్దాలి.
ఎక్కువగా బ్రషింగ్ చేయడం కూడా కురులకు కీడు చేస్తుంది.
తలంటు తర్వాత తలను మెత్తటి టవల్‌తో, వీలైనంత మృదువుగా తుడవాలి. అదీ జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే చేయాలి. తడిగా ఉన్న జుట్టును బరబరా తుడిచేయొద్దు.
జుట్టును ఆరబెట్టే పరికరాలను (హెయిర్ డ్రయర్లు) ఎక్కువగా వాడొద్దు. అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా తలపైన ఉండే సున్నితమైన కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంది.
తల బాగా ఆరిన తర్వాతే దువ్వెనతో దువ్వడం మంచి అలవాటు.
కొన్ని రకాల హెయిర్ ప్రొడక్ట్స్ (హెయిర్‌డై, కడిషనర్స్)ను ఎక్కువగా వాడటం కూడా కేశసంపదను బలహీనం చేస్తంది. సౌందర్య సాధనాల్లో ఉపయోగించే రసాయనాలు జుట్టుపై ప్రభావం చూపిస్తాయి.
రకరకాల హెయిర్ స్టైల్స్ జట్టుపై ఒత్తిడి కలిగించడంతోపాటు కుదుళ్లను బలహీనం చేస్తాయి.
No comments: