
కావాల్సినవి:
రంగురంగుల గుండీలు (చిన్నవి, పెద్దవి)
పెద్ద బెలూన్ - 1
కత్తెర, సూది
గ్లూ స్టిక్/ గమ్ బాటిల్ - 1
గ్లాసు - 1
తయారీ:
బెలూన్‌లో తగినంత పరిమాణంలో గాలి నింపుకోవాలి.
ఊదిన బెలూన్ మూతి బిగించి కట్టి, చిత్రంలో చూపిన విధంగా గ్లాసులో మూతి భాగం ఉండేలా అమర్చాలి.
బోర్లిచిన బెలూన్ పై భాగంలో మందంగా గమ్ పూయాలి. ఇది ఆరిన తర్వాత మరోసారి గమ్ కోటింగ్ వేస్తే బౌల్ మందంగా వస్తుంది.
బౌల్ అడుగుభాగం గట్టిగా ఉంచడానికి ముందుగా బెలూన్ పై భాగంలో పెద్ద గుండీలను గమ్ పెట్టి అతికించాలి.
వాటి చుట్టూ చిన్నచిన్న గుండీలను అతికించాలి. మనకు కావాల్సినబౌల్ పరిమాణానికి సరిపడినన్ని గుండీలు అతికించుకోవచ్చు.
అతకడం పూర్తయిన తర్వాత దాన్ని కనీసం 4 నుంచి 5 గంటలు ఆరనివ్వాలి.
తర్వాత సూదితో బెలూన్‌ను పగులకొట్టాలి.
చివరగా అంచులవెంటబడి ఎండిపోయిన గమ్‌ను కత్తిరించుకుంటే అందమైన బటన్స్ బౌల్ రెడీ!
No comments: