pop

సిగరెట్‌ మానేసేందుకు ఇదీ ఓ అవకాశం!


డెహ్రాడూన్‌: సిగరెట్‌ తాగడం హానికరం అని ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రకటనలు విడుదల చేసినా అది పొగరాయుళ్లపై అంత ప్రభావం చూపలేదు. పలు రోగాలకు పొగే కారణమని వైద్యులు చెప్తున్నా ఎవరూ విన్పించుకోనేలేదు. వీరెవరూ చేయలేని పని ఇప్పుడు నోట్ల రద్దు వ్యవహారం చేసింది. గత పదిరోజుల్లో సిగరెట్ల కొనుగోళ్లు దాదాపు 40శాతం తగ్గిపోయాయని వ్యాపారస్థులు చెపుతున్నారు. ఒక జాతీయ మీడియా సంస్థ చేసిన సర్వేలో వారు ఈ విషయాలు వెల్లడించారు. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత తమ వ్యాపారం బాగా పడిపోయిందని, చిల్లర లేక చాలా మంది కొనుగోలుదారులు సిగరెట్లు కొనుగోలు చేయలేదని చెపుతున్నారు. విపరీతంగా పొగతాగే అలవాటున్న వారికి కాస్త ఆ అలవాటు తగ్గించుకునేందుకు ఇది దోహడపడుతోందంటున్నారు మరికొందరు. 'పెద్ద నోట్లు రద్దు చేసిన రోజు నా షాప్‌లో ఎవ్వరూ సిగరెట్‌ కొనలేదు. ఆ రోజు నుంచి నా షాప్‌లో అమ్మకాలు దాదాపు సగానికి పడిపోయాయి' అని ఒక పాన్‌షాప్‌ నిర్వాహకుడు తెలిపారు. 'ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం నేను సిగరెట్‌ మానేసేందుకు చాలా సహాయపడుతోంది. నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించినప్పటి నుంచి నేను రోజుకు ఒక్క సిగరెట్‌ మాత్రమే కాలుస్తున్నాను. ఇది క్రమేపీ నేను సిగరెట్‌ పూర్తిగా మానేసేందుకు దోహదపడుతుంది' అని లలిత్‌ బిస్త్‌ ఆనందం వ్యక్తం చేశారు.

No comments:

Powered by Blogger.