pop

రొమాంటిక్ సీన్స్‌పై కేంద్ర మంత్రి వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు


న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ శాఖా మంత్రి వెంకయ్య నాయుడు సినీరంగంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సినిమాల్లో అశ్లీలత పెరుగుతోందని చెప్పారు. సినిమాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకే సందేశాత్మక చిత్రాలు తీస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాల్లో హింస, అశ్లీలతకు చోటు లేకుండా కేవలం భావోద్వేగ ప్రధానంగా తీస్తే సమాజానికి ఎంతో మంచిదని ఆయన సూచించారు. హీరోయిన్‌ను ముట్టుకోకుండా రొమాన్స్‌ను రక్తికట్టించొచ్చని వెంకయ్య చెప్పారు. కళ్లు, పెదవులు, ముక్కు, చూపులతో రొమాన్స్‌ను పండించొచ్చని ఆయన తెలిపారు. అనవసరంగా హీరోయిన్లను అసభ్యంగా చూపించొద్దని ఆయన సూచించారు. పీకే, ఓయ్ లక్కీ లక్కీ ఓయ్, లగేరహో మున్నాభాయ్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, నో వన్ కిల్ల్‌డ్ జెస్సికా తన అభిమాన చిత్రాలని ఆయన తెలిపారు.

No comments:

Powered by Blogger.