pop

ఐశ్వర్య మరో హాట్‌ షాక్‌ ఇస్తోందట!


నాలుగు పదుల వయసులోనూ గ్లామర్‌ విందు అందిస్తోంది అందాల తార ఐశ్వర్యారాయ్‌. ఇటీవల ఆమె ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ సినిమాలో రణ్‌బీర్‌తో హాట్‌ హాట్‌ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరో హాట్‌ షాక్‌ ఇవ్వడానికి సిద్ధపడుతోందట. రాధికా ఆప్టే నగ్నంగా నటించిన ‘పర్చేద్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన లీనా యాదవ్‌తో ఐశ్వర్య కలిసి పనిచయబోతోందట. సహజత్వం పేరుతో సినిమాలను చాలా బోల్డ్‌గా తెరకెక్కిస్తుంది లీనా యాదవ్‌. ఐశ్వర్య 11 ఏళ్ల క్రితమే ఆమెతో ‘శబ్ద్‌’ అనే సినిమాలో నటించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఐష్‌తో లీనా పనిచేయాలనుకుంటోందట. ఇటీవల హాట్‌ హాట్‌గా నటించేందుకు ఐష్‌.. సిద్ధమవడంతో అలాంటి కంటెంట్‌తోనే ఓ స్ర్కిప్టు తయారు చేసిందట లీనా. మరి, ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!

No comments:

Powered by Blogger.