pop

ఆ ఒక్క రాత్రి కోసం.. భారీగా తీసుకుంటున్న టాప్ హీరోయిన్!


తమన్నా.. మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించింది. చూడడానికి మిల్కీగా ఉన్నా.. అమ్మడు కాలు కదిపిందంటే.. హాట్ హాట్‌గా ఉంటుంది. టాలీవుడ్ టాప్ హీరోలందరితో ఆడపాడిన ఈ భామ ప్రతి సినిమాలోనూ తనదైన అందాలతో అదరగొట్టేసింది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా ఐటం గాళ్‌గా సైతం ఈ బ్యూటీని ఎంచుకుంటున్నారంటే.. ఈ అమ్మడు అందాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోగలరు. ఇటీవల గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో సైతం ఈ భామ యువత మతి పోగొట్టిందనే చెప్పాలి. తాజాగా ఈ సెక్సీ బ్యూటీ మరో బంపర్ అవకాశాన్ని తన ఖాతాలో వేసుకున్నట్టు సమాచారం. కేవంల ఒకే ఒక్క నైట్ కోసం ప్రముఖ హోటల్ యజమానులు ఈ అమ్మడును బుక్ చేసుకున్నట్లు టాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. 2017 నూతన సవంత్సర వేడుకల కోసం నిర్వహించే ఒక కార్యక్రమం కోసం చెన్నైలోని ఒక హోటల్ యాజమాన్యం తమన్నాను ఇప్పుడే బుక్ చేసుకున్నారట. ఈ కార్యక్రమం కోసం తమన్నాకు రూ. 1.20కోట్లు చెల్లించనున్నారట. ఈ కార్యక్రమంలో భాగంగా తమన్నా పది పాటలకు నడుం తిప్పనున్నారట. అయితే, ఆ పాటలను మాత్రం యాజమాన్యమే డిసైడ్ చేస్తుందట. నూతన సంవత్సర వేడుకల కోసం ఆఫర్‌నే కాక, ఇంతటి భారీ ఆఫర్‌ను అందుకున్న బ్యూటీ తమన్నానే కావడం గమనార్హం.

No comments:

Powered by Blogger.