pop

నోట్ల రద్దుపై ఓ నీతి కథ...


అనగనగా ఒక చెరువు. చెరువులోకి పెద్ద మొసలి చేరింది. ముళ్ల ముళ్ల చర్మం, రంపాల వంటి పళ్లు.. క్రూరంగా ఉంది. చేపలూ, కప్పలూ, పాములూ.. సమస్త జలచరాలూ భయంతో వణికిపోయాయి. కాపాడండి ప్రభో అని మొరబెట్టుకున్నాయి. ‘ఎంత పెద్దదైనా సరే భయపడం, నీళ్లలోంచి మొసలిని బయటకు రప్పిస్తాం, ప్రజలను రక్షిస్తాం’ అని రాజుగారు భీకర ప్రతిజ్ఞ చేశారు. ‘ఎండబెట్టండి చెరువు’ అని ఆజ్ఞాపించారు. వందలాది పంపులు పని మొదలుపెట్టాయి. నీళ్ళకి కటకట అయిపోయింది. ‘ నీళ్ళో రామచంద్రా’ అని చిన్నచితకా జలజీవులన్నీ హాహాకారాలు చేశాయి. ‘దేశ భవిష్యత్తు కోసం ప్రజలు సహకరించాలి’ అని రాజుగారు టీవీల్లో విజ్ఞాపన చేశారు. చెరువు ఎండిపోయింది. మొసలి మెల్లగా దర్జాగా నడుచుకుంటూ పక్కనే ఉన్న నదిలోకి వెళ్లిపోయింది. చెరువును నమ్మకున్న చేపా కప్పా సమస్తమూ చచ్చూరుకున్నాయి.

No comments:

Powered by Blogger.