
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని ఇటీవల పుకార్లు వచ్చాయి. ఈ వార్త బాగా ప్రచారం కావడంతో అనిరుధ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తనకు నిశ్చితార్థం కాలేదని స్పష్టం చేశారు. నిశ్చితార్థమా? నాకా? అని నవ్వుతూ.. తానింకా సింగిల్‌గానే ఉన్నానని, చిన్నవాడినేనని ట్వీట్ చేశారు. అయితే కథానాయిక సమంత.. అనిరుధ్‌ని ఆటపట్టిస్తూ రిప్లై ఇచ్చారు. ‘కానీ ఆమె చాలా మంచి అమ్మాయి కదా.. ఏమైంది?’ అని ట్వీట్ చేశారు. ఏదేమైనప్పటికీ అనిరుధ్‌కి నిశ్చితార్థం కాలేదని తేలింది.
అనిరుధ్ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆయన స్వరాలు అందిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇది. అనిరుధ్ కంపోజ్ చేసిన ‘కొలవెరీ’ పాట ఒక దశలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేసిన సంగతి తెలిసిందే.

No comments: