pop

రణ్‌బీర్‌పై సల్మాన్‌ సెటైర్‌


ముంబయి: బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌లకి ఒకరంటే ఒకరికి పడదన్న విషయం తెలిసిందే. కత్రినా కైఫ్‌ కారణంగా సల్మాన్‌కి రణ్‌బీర్‌తో విభేదాలు ఏర్పడ్డాయని రణ్‌బీర్‌ సినిమాల్లోకి రాకముందు సల్మాన్‌ అతనిపై చేయిచేసుకున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. తాజాగా సల్మాన్‌.. రణ్‌బీర్‌పై సెటైర్‌ వేశాడు. సల్లూభాయ్‌ హోస్ట్‌ చేస్తున్న సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఆలియా భట్‌ డియర్‌ జిందగీ చిత్ర ప్రచార కార్యక్రమానికి వచ్చింది. డియర్‌ జిందగీ తర్వాత ఆలియా రణ్‌బీర్‌తో కలిసి 'డ్రాగన్‌' సినిమాలో నటించనుంది. ఇదే విషయమై సల్మాన్‌ మాట్లాడుతూ.. 'రణ్‌వీర్‌ని మాయం చేసేయ్‌.. రణ్‌బీర్‌ ఎలాగూ మాయం అయిపోతున్నాడు' అన్నాడు. రణ్‌బీర్‌నటించిన 'యే దిల్‌ హై ముష్కిల్‌'కి ముందు అతని కెరీర్‌గ్రాఫ్‌ ఫ్లాప్స్‌తో సాగడంతో సల్మాన్‌ ఇలా కామెంట్‌ చేశాడట.

No comments:

Powered by Blogger.