pop

అంబానీ కుమారుడితో కత్రినా డేటింగ్‌?


ముంబయి: రణ్‌బీర్‌తో బ్రేకప్‌ అయిన వార్తలు ఇంకా హల్‌చల్‌ చేస్తుండగానే మరోసారి క్యాట్‌ వార్తల్లోకెక్కింది. రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీతో కత్రినా డేటింగ్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. దీపావళికి బిగ్‌బి అమితాబ్‌ ఇంట్లో గ్రాండ్‌గా నిర్వహించిన పార్టీకి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. ఈ పార్టీకి ఆకాశ్‌అంబానీ, కత్రినాలు కలిసి ఒకే కారులో వచ్చారట. ఆ తర్వాత అనిల్‌ కపూర్‌ ఇంటికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లినట్లు తెలుస్తోంది. అనిల్‌ కపూర్‌ ఇంట్లో పార్టీకి కత్రినా మాజీ ప్రేమికుడు రణ్‌బీర్‌ కూడా వచ్చాడు. కానీ కత్రినా మీడియా కంట పడకుండా కాస్త దూరంగా ఉన్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

No comments:

Powered by Blogger.