pop

నాగార్జున సినిమా కూడా లీక్‌


బాహుబలి-2 సినిమా క్లిప్పింగ్‌లను చోరీ చేసి.. షేర్‌ చేసిన కేసులో బెజవాడ పోలీసులు ఆరుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు సెల్‌ఫోన్లతోపాటు ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరి వద్ద నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ సినిమా క్లిప్పింగ్‌ను కూడా గుర్తించారు. అయితే ఈ దృశ్యాలు ఎవరికీ షేర్‌ చేయలేదని తెలిసింది. విజయవాడలోని సెంట్రల్‌ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ సత్యానందం, టాస్క్‌ఫోర్సు ఏసీపీ మురళీధర్‌లు బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. బహుబలి-2 సినిమా క్లిప్పింగ్స్‌ను ఎడిటింగ్‌ విభాగంలో పని చేస్తున్న కృష్ణదయానంద్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని... తన స్నేహితుడు అయిన అక్కి కృష్ణచైతన్యకు పంపించాడు. కృష్ణచైతన్య ఆ క్లిప్పింగ్‌ను తన ఇద్దరు స్నేహితులైన బీకాం విద్యార్థులు నూరుద్దీన, సర్వోత్తమ్‌లకు షేర్‌ చేశారు. వారు తమ స్నేహితులైన బీటెక్‌ విద్యార్థులు పార్థూ శ్రీను, సాయి సుదర్శనలకు పంపించారు. కృష్ణ దయానంద్‌తోపాటు ఆరుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

1 comment:

  1. JSMH Gaming announces new US$3B mobile sports betting
    JSMH Gaming 용인 출장샵 has announced the launch of its latest 경상북도 출장샵 US$3B mobile sports betting partnership, 순천 출장안마 after launching 전라북도 출장마사지 a 오산 출장샵 mobile sportsbook that has

    ReplyDelete

Powered by Blogger.