pop

మాట మార్చిన ట్రంప్


వాషింగ్టన్: తాను మాటలు చెప్పే రకం కాదని.. వాటిని చేతల్లో చూపే రకం అని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చాలా సార్లు వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు, మెక్సికన్లు, ముస్లింలు, చైనా ఉత్పత్తుల బ్యాన్ వంటి చాలా హామీలను అమెరికన్లకు ట్రంప్ ఇచ్చారు. వీటి సంగతి పక్కనపెడితే ఓ విషయంలో మాత్రం ట్రంప్ మాట మార్చారు. ‘నేను అధికారంలోకి అమెరికన్లను మోసం చేసిన హిల్లరీని జైలుకు పంపిస్తా. మెయిల్ బాగోతం బయటపెడతా. హిల్లరీ జైలు ఊచలు లెక్కించాల్సిందే..’.. ఇవీ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వ్యాఖ్యానాలు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ పూర్తిగా పక్కనపెట్టేశారట. హిల్లరీపై కేసు గురించి తనకు అనవసరం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ సన్నిహితులు పేర్కొంటున్నారు. మెయిల్స్ కేసు విషయంలో హిల్లరీకి ఇప్పటివరకూ జరిగింది తనకు చాలని, ఈ విషయంలో ఇక తల దూర్చకుండా ఉండటమే రాజకీయంగా మంచిదని ట్రంప్ అభిప్రాయపడుతున్నారట. ఓ అమెరికన్ పత్రికకు హిల్లరీ సలహాదారు కెల్లయాన్నే కౌన్వే ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ‘హిల్లరీని అమెరికన్లు నమ్మలేదు. తప్పు చేశారనే మెజారిటీ అమెరికన్లు అంగీకరిస్తున్నారు. ఆమెపై కేసు నడుస్తోంది. ఒకవేళ ట్రంప్ కనుక హిల్లరీని ఈ కేసు నుంచి బయటపడేలా చేస్తే మరీ మంచిది’ అని కౌన్వే అభిప్రాయపడ్డారు. తన వంద రోజుల ప్రణాళికలో హిల్లరీ వ్యవహారం కూడా లేకపోవడంతో ఈ విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టినట్లే కనిపిస్తోందని అమెరికన్లు మాట్లాడుకుంటున్నారు.

No comments:

Powered by Blogger.