pop

మద్యం ప్రియులు కూడా మంచి పని చేశారు


దేవరుప్పుల(జనగామ జిల్లా): మండల కేంద్రంలోని మధ్యం సిట్టింగ్‌ షాపులో పనిచేస్తున్న ఇద్దరు బాలకార్మికులను మద్యం ప్రియులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మండలంలోని సీతారాంపురానికి చెందిన పైండ్ల రవి, ఆవుల యాకయ్యలు మద్యం తాగి సిట్టింగ్‌ షాపునకు వెళ్లగా అందులో పనిచేస్తున్న ధర్మాపురం గ్రామ లకావతతండకు చెందిన లకావత కిషన్, స్వరూపల కుమారుడు (14)తోపాటు కొడకండ్ల మండలం గంట్లకుంట్ల గ్రామానికి చెందిన మరో బాలుడు దేవరుప్పులలో తన అమ్మమ్మ నడి రామక్క ఇంట్లో ఉండి సిట్టి ంగ్‌ షాపులో పని చేస్తున్నారు. ఈక్రమంలో వారు సీఎం చాంబర్‌ ఫోన నంబర్‌ 040 23456698కు కాల్‌ చేసి విషయాన్ని వివరించారు. పోలీసులు బాల కార్మికులిద్దరినీ స్టేషనకు తీసుకెళ్లారు.

No comments:

Powered by Blogger.