pop

ఆ దర్శకుడి నాలుక కోస్తే రూ.కోటి


మథుర: వినోదం పంచాల్సిన సినిమాకి ‘టాయ్‌లెట్‌-ఏక్‌ ప్రేమ్‌కథా’ అనే టైటిల్‌ పెట్టిన దర్శకుడి నాలుక కోసి తెచ్చిస్తే కోటి రూపాయలు ఇస్తానంటున్నాడు మథురకి చెందిన ఓ సాధువు. బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి నరైన్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నంద్‌గావ్‌, బర్సానా గ్రామాల్లో జరుగుతోంది. అయితే సినిమాకి టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథా అని పేరు పెట్టడం ఇరు గ్రామాల ప్రజల భావోద్వేగాలను కించపరిచినట్లు అవుతుందని బెహారీ దాస్‌ మహరాజ్‌ అనే సాధువు ఆరోపించారు. సోమవారం సాధువులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మహరాజ్‌ మాట్లాడుతూ.. సినీ నిర్మాత చిత్రం పేరు మార్చాలని డిమాండ్‌ చేశారు. నంద్‌గావ్‌ గ్రామ ప్రజలు బర్సానా గ్రామానికి చెందినవారిని వివాహం చేసుకోరని, అలాగే బర్సానా గ్రామస్థులు కూడా నంద్‌గావ్‌ వాసులని పెళ్లిచేసుకోరని సినిమాలో నటీనటులు ఈ రెండు గ్రామాలకు చెందినవారిగా వారి మధ్య ప్రేమ చిగురించినట్లుగా చూపిస్తున్నారని ఆరోపించారు. అదీకాకుండా రాధాకృష్ణులు పుట్టిన ఈ రెండు గ్రామాల్లో టాయ్‌లెట్‌ పేరుతో సినిమా తీయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సినిమా టైటిల్‌ మార్చకపోతే షూటింగ్‌ జరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ విషయమై దర్శకుడు నరేన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. తమ సినిమాలో ప్రజల భావోద్వేగాలను కించపరిచే విధంగా తెరకెక్కించడంలేదని చిత్రీకరణ నంద్‌గావ్‌, బర్సానా గ్రామాల్లో జరుగుతున్నా సినిమాలో ఈ రెండు పేర్లుచూపించడంలేదని పేర్కొన్నారు. సినిమా అంతా ఓ మహిళ సాధికారత గురించి స్వచ్ఛత గురించే ఉంటుందని తెలిపారు. టాయ్‌లెట్‌ చిత్రంలో అక్షయ్‌కి జంటగా భూమి పెడ్నేకర్‌ నటిస్తోంది.

No comments:

Powered by Blogger.