
హైదరాబాద్: బాలీవుడ్ నటి విద్యాబాలన్ నగరానికొచ్చారు. తాను నటించిన కహానీ2 చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఫోరం సుజనా మాల్‌లో అభిమానులతో సెల్ఫీలు దిగిన ఆమె, ఎస్‌మార్ట్‌లో సరికొత్త టీవీలనూ ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని తక్ష్ రెస్టారెంట్‌లో ఫుడ్ టేస్ట్ చేసి పాతబస్తీనూ సందర్శించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ‘కహానీ 2’ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నట్లు చెప్పిన విద్యా, నోట్ల రద్దు మొదలు హైదరాబాదీతో తన బంధం వరకూ పలు విషయాలను ముచ్చటించారు. ఆ విశేషాలు... హైదరాబాద్‌తో నా అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే నా లక్కీ సిటీలలో ఇది ఒకటి. ‘డర్టీ పిక్చర్’ షూటింగ్ ఇక్కడే జరిగింది. అలాగే ‘బాబీ జాసూస్’ చిత్రం మొత్తం షూటింగ్ ఇక్కడే జరిగింది. మరీ ముఖ్యంగా పాతబస్తీ ఏరియాలో..! ఇక్కడివాతావరణం, ఆ ప్రాంతాలు.. మరీ ముఖ్యంగా పాతబస్తీలోని అలనాటి కట్టడాలు నాకు చాలా చాలా ఇష్టం.తెలుగు కొద్ది కొద్దిగా వచ్చు. ఎంతైనా సౌత్ ఇండియన్ అమ్మాయిని కదా..! హైదరాబాదీ ఫేమస్ బిర్యానీ మాత్రం రుచి చూడలేదు. ఎందుకంటే నేను నాన్‌వెజ్ తినను.
బాహుబలి-2 కోసం చూస్తున్నా..
బాహుబలి-2 చిత్రం కోసం ఆసక్తిగా చూస్తున్నాను.బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అనే ఆలోచన వచ్చిందంటే చాలు టెన్షన్ పెరిగిపోతుంది. రాజమౌళిని త్వరగా ఈ సినిమా పూర్తి చేసి విడుదల చేయమని అందరూ చెప్పండి(నవ్వు). బెస్ట్ మూవీ ఇది. తెలుగులో అవకాశం వస్తే చేయడానికి అభ్యంతరం లేదు. కాకపోతే నాకు తగిన స్ర్కిప్ట్ వస్తేనే..! అందునా రాజమౌళి అంటే ఇంకా ఆనందం.
No comments: