pop

వీఆర్‌లో రెహమాన్ ‘వందేమాతరం’


సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్ స్వరాలు కూర్చగా దేశాన్ని ఓ ఊపు ఊపేసిన ‘వందేమాతరం’ గీతం వర్చువల్‌ రియాలిటీ (వి.ఆర్‌.) పద్ధతిలో విడుదలైంది. గోవాలోని పణాజీలో జరుగుతున్న అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలోని పదవ ఎనఎఫ్‌డీసీ ఫిల్మ్‌ బజార్‌లో వీఆర్‌ విధానంలోని ఈ గీతాన్ని సోమవారం ఆవిష్కరించారు. దీంతో 360 డిగ్రీల కోణంలో ఈ గీతాన్ని చూసి ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు కలిగింది. 4కె స్టీరియోస్కోపిక్‌లో చిత్రించిన ఈ వీడియోలో ‘వందేమాతరం’ గీతంతో పాటు భారతరత్న ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మికి శ్రద్ధాంజలి ఘటిస్తూ న్యూయార్క్‌లో ఆగస్ట్‌ 15న రెహమాన్ నిర్వహించిన కచేరీ కూడా ఉండటం గమనార్హం. ‘‘రోజురోజుకీ కళను మనం ఆస్వాదించే విధానం వాస్తవానికి దగ్గరవుతూ వస్తోంది. వీఆర్‌లో ‘వందేమాతరం’ను అందించడం ఉద్వేగాన్ని కల్గించింది’’ అని చెప్పారు రెహమాన్.

No comments:

Powered by Blogger.