pop

అల్లు అర్జున్‌కు కుమార్తె జననం


హైదరాబాద్: అల్లు వారింట మహాలక్ష్మి అడుగిడింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి దంపతులకు సోమవారం సాయంకాలం కుమార్తె జన్మించింది. దీంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో తేలియాడుతోంది. ఈ విషయాన్ని బన్నీ తన వ్యక్తిగత ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో పోస్ట్ చేశాడు. కాగా, బన్నీ దంపతులకు తొలి సంతానంగా అబ్బాయి అయాన్ జన్మించిన సంగతి తెలిసిందే. ఒక అబ్బాయి, ఒక అమ్మాయితో తనకు ఎంతో ఆనందంగా ఉందని, తాను అదృష్టవంతుడినని బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. తమను అభినందించినవారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

No comments:

Powered by Blogger.