pop

నేనిక అమెరికా ఆటగాడిని


జమీల్‌ పఠాన్‌ ఖాన్‌. తెలంగాణకు చెందిన అంతర్జాతీయ కరాటే మాస్టర్‌. కుంగ్‌ఫూలోనూ ఆరితేరిన మొనగాడు. కటిక పేదరికంలో పుట్టిన అతను 16 ఏళ్లలో దాదాపు యాభై అంతర్జాతీయ పతకాలు సాధించాడు. సొంత ప్రతిభతో, కష్టంతో ఆటలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. కానీ, అతణ్ణి ప్రభుత్వం ఏనాడూ గుర్తించలేదు. పైసా ప్రోత్సాహకం ఇవ్వలేదు. కెరీర్‌ ఆరంభించింది మొదలు ఈ 16 ఏళ్లలో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. ఉండటానికి ఇళ్లు, కుటుంబ పోషణ కోసం ఓ ఉద్యోగం ఇప్పించమని నలుగురు ముఖ్యమంత్రులు.. మంత్రులు, కేంద్ర, రాష్ట్ర క్రీడాధికారులను ఎంతగానో వేడుకున్నాడు. అయినా ఫలితం రాలేదు. విసిగివేసారిన జమీల్‌.. తనను ఆదరించిన అమెరికాకు వెళ్లిపోయాడు. ఇకపై తాను అమెరికాకు ప్రాతినిథ్యం వహిస్తానని చెబుతున్నాడు. ఈ మేరకు న్యూయార్క్‌లోని రికుధిజా కేటీవోసీ తరఫున మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్టు జమీల్‌ తెలిపాడు. ఇప్పటికే అమెరికా తరఫున ఓ టోర్నీలో పాల్గొన్న అతను బంగారు, రజత పతకాలు గెలిచాడు.

No comments:

Powered by Blogger.