pop

టాలీవుడ్ టాప్ హీరోతో... శ్రియ ఆ రాత్రి ఏం చేసింది?


శ్రియ.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోలందరితో ఆడిపాడిన ఈ భామ.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో అవకాశాలు పొందలేకపోయింది. అయితే, గౌతమి పుత్ర శాతకర్ణి రూపంలో బాలకృష్ణ సరసన నటిస్తోంది. ఈ హాట్ భామకు సంబంధించి ఈ మధ్య ఒక ఆసక్తికరమైన రూమర్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్‌కు చెందిన టాప్ యంగ్ హీరోతో ఈ అమ్మడు డేటింగ్‌లో ఉందని ఇండస్ట్రీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఇటీవల ముంబయిలోని తన ఖరీదైన ఇంట్లో ఒక పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి ఆ హీరోతో పాటు శ్రియ కూడా హాజరైంది. అయితే, పార్టీలో ఈ హీరోహీరోయిన్ల మధ్య బాండింగ్ చూసిన టాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోయారట. అంతేకాదు, పార్టీ అయిపోయిన తరువాత కూడా దాదాపు తెల్లవారు జామున 5 గంటల వరకు ఈ జంట అక్కడే ఎంజాయ్ చేశారట. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారంట. ఈ వార్తలు కాస్త శ్రియ చెవిన పడడంతో తాను ఆ హీరో ఎప్పటినుంచో స్నేహితులమని, తమ మధ్య ఏమీ లేదని తన సన్నిహితుల వద్ద వాపోతుందట ఈ అమ్మడు. ఏమీ లేకపోతే, తెల్లవారు జాము వరకు ఇద్దరూ ఎందుకు కలిసి ఉన్నారని అడుగుతున్నారట సినీ జనాలు. కాగా, గతంలో ఒక కార్యక్రమంలో కూడా ఈ యంగ్ హీరో.. హీరోయిన్ త్రిషతో ఇలాగే వ్యవహరించడం.. అదో పెద్ద న్యూస్ అవడం అందరికీ తెలిసిందే. ఆ హీరో ఎవరో మీకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది కదా!

No comments:

Powered by Blogger.