pop

56 కార్లు ఒకేచోట ఢీకొన్నాయి


బీజింగ్‌: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 56కార్లు ఒకే రహదారిపై ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ఘటన చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో బీజింగ్‌-కున్‌మింగ్‌ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. రహదారిపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో కార్లు, భారీ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17మంది అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 37మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన పలు వాహనాల్లో మంటలు చెలరేగగా సహాయ సిబ్బంది వాటిని అదుపుచేశారు. రహదారిని తాత్కాలికంగా మూసివేసి.. పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

No comments:

Powered by Blogger.