
హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) బస్సుల్లో ఉచిత (కాంప్లిమెంటరీ) వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు భారతీ ఎయిర్‌టెల్, టీఎస్‌ఆర్‌టీసీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌లో రద్డీ ఎక్కువ ఉండే మార్గాల్లో ప్రయాణించే 115 మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా 6 నెలల పాటు వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారు ఎవరైనా రోజుకు 20 నిమిషాల పాటు ఉచితంగా వైఫై సేవలు వినియోగించుకోవచ్చు. ఏ టెలికాం ఆపరేటరు సేవలు వినియోగించుకుంటున్న చందాదారుడైనా, వైఫై సేవలను 20నిమిషాలపాటు పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. బస్సులో ప్రయాణిస్తూ.. తమకు ఇష్టమైన కంటెంట్, యాప్‌లు, వినోదం తదితరాలన్నింటినీ 4జీ నెట్‌వర్క్‌పై వీక్షించవచ్చని పేర్కొంది. మన నగరాలకు ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో ఎయిర్‌టెల్ నిరంతరం పెట్టుబడులు పెడుతోందని, వినూత్న విధానాలు అనుసరిస్తోందని భారతీ ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) వేంకటేశ్ విజయ్‌రాఘవన్ తెలిపారు.
No comments: