pop

దుబాయ్‌లో తెలంగాణవాసికి ‘ఫేస్‌బుక్’ శిక్ష!


కనీస అవగాహన లేకుండా సోషల్ మీడియాను ఉపయోగించి.. ఓ తెలుగు వాడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తన ఫేస్‌బుక్ ఖాతాకు వచ్చిన ఓ పోస్ట్‌ను చూసి లైక్, షేర్ చేయడం రియాద్‌లో పెద్ద దుమారమే రేపింది. ఇస్లాం పుణ్యక్షేత్రం మక్కాలోని హరం మసీదు ఫోటోపై శివుడి ఫోటో పెట్టినందుకు ఓ తెలుగు వాడు అరెస్టయినట్లుగా వస్తున్న వార్తల్లో అసలు నిజాలు వెల్లడవుతున్నాయి. కర్జూరపు పండ్ల తోటలో మాలీగా పని చేస్తున్న నిరక్షరాస్యుడు తనకు వచ్చిన ఒక ఫోటోను తెలియక అమాయకంగా చేసిన షేరింగ్ ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చింది. కొందరు దుర్మాగులు అతని ఫేస్‌బుక్‌ ఖాతాను మార్చి ప్రొఫైల్‌లో అతడు ఇంజినీర్ అని, విశ్వవిద్యాలయం పట్టభద్రుడని తప్పుడుగా పేర్కొనడమే కాకుండా ఆకర్షనీయంగా ఉన్న మరో వ్యక్తి ఫోటో పెట్టడం.. సోషల్ మీడియాలో వైరల్ అయి అరబ్బుల ఆగ్రహానికి కారణమైంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన పొన్నం శంకర్.. రియాధ్ సమీపంలోని అల్ ఘసీం హైవేపై అల్ మజ్మాలో కర్జూరపు తోటలో మాలీగా పని చేస్తున్నాడు, మక్కాలో మసీదుపై శివుడు కూర్చున్నట్లుగా తనకు వచ్చిన ఒక ఫోటోను అతను షేర్ చేయడమే కాకుండా లైక్ కూడా చేసాడు. శరవేగంగా వైరల్ అయిన ఆ పోస్ట్‌ను చూసి సమీపంలోని కొందరు మలయాళీలు అతడికి ఈ విషయం చెప్పారు. దీంతో తప్పును గ్రహించిన అతడు అరబ్బులకు క్షమాపణ చెప్పాడు. తనను కొట్టవద్దని, పోలీసులకు పట్టించవద్దని అందుకు తాను ఇస్లాం మతంలో మారడానికి కూడ సిద్ధమని కూడా చెప్పాడు. తన అరబ్బు యాజమానికి జరిగిన సంగతి వివరించి తనను రక్షించవల్సిందిగా కోరాడు. యాజమాని దాని గూర్చి పట్టించుకోవల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాడు. కానీసోషల్ మీడియాలో శంకర్‌పై విపరీతమైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే తనపై పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలను కూడా అతను తెలుసుకోలేకపోయాడు. సోషల్ మీడియాలో దుమారం రేగడంతో పోలీసులు ఆదివారం సాయంత్రం అతడిని అరెస్టు చేశారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ కేసు సంచలనం సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో చూయించినట్లుగా అతన్ని కొడుతున్నట్లుగా కూడా ఇతర క్లిప్పింగును ప్రదర్శిస్తున్నారు, పోలీసుల అదుపులో ఉన్న శంకర్‌ను ప్రైవేటు వ్యక్తులు కొట్టడానికి ఆస్కారం లేదు. అతడు అమాయకుడని అతడి గురించి తెలిసిన మలయాళీ సామాజిక కార్యకర్త ఒకరు చెప్పారు. స్మార్ట్ ఫోన్ల ఆపరేషన్, ఫేస్‌బుక్ గూర్చి అవగాహన లేని నిరక్షరాస్యులు ఈ విషయంలో పరా హుషార్.

No comments:

Powered by Blogger.