pop

విజయ్‌ని ఎప్పటికీ ప్రేమిస్తా: అమలాపాల్‌


చెన్నై: తన మాజీ భర్త ఎ.ఎల్‌. విజయ్‌ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని కథానాయిక అమలాపాల్‌ అన్నారు. దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌, అమలాపాల్‌ల వివాహం 2014లో జరిగింది. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ ఇటీవల విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్‌ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 18 ఏళ్లప్పుడు నట జీవితాన్ని మొదలుపెట్టానని, 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నానని చెప్పారు. నిర్ణయాలు తీసుకోవడానికి అది సరైన వయసు కాదని అభిప్రాయపడ్డారు. తనను ఎవరూ గైడ్‌ చేయలేదని, తప్పుల నుంచీ జీవితాన్ని నేర్చుకున్నానని తెలిపారు. తాను విజయ్‌ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని, అతడికి దూరం కావడానికి కారణం కూడా అదేనని భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో తీసుకున్న బాధాకరమైన, కష్టతరమైన నిర్ణయం ఇదేనన్నారు. అనుభవంతో నేర్చుకునే పాఠాలివి.. అని అమలాపాల్‌ చెప్పారు. ప్రస్తుతం అమలాపాల్‌.. ధనుష్‌ సరసన ‘వడ చెన్నై’, ‘విఐపీ 2’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవే కాకుండా మరో తమిళ, మలయాళ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

No comments:

Powered by Blogger.