pop

విరాట్ కోహ్లి బాల్ టాంప‌రింగ్‌!


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై బాల్ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు చేసింది ఓ బ్రిటిష్ టాబ్లాయిడ్‌. రాజ్‌కోట్ టెస్ట్ సంద‌ర్భంగా కోహ్లి.. ఓ స్వీట్ అవ‌శేషాల‌ను ఉప‌యోగించి బాల్ షేప్‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా మార్చాల‌ని ప్ర‌య‌త్నించిన‌ట్లు ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. వీడియో ఫుటేజీలో ఇది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెప్పింది. అయితే ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం విరాట్‌పై వ‌చ్చిన ఆరోప‌ణలు ఇప్పుడు ఎలాంటి ప్ర‌భావం చూపే అవకాశం లేదు. ఎందుకంటే ఇంగ్లండ్ టీమ్ దీనిపై ఎలాంటి ఫిర్యాదు న‌మోదు చేయ‌లేదు. దీనిపై స్పందించ‌డానికీ ఆ టీమ్ నిరాక‌రించింది. బాల్ టాంప‌రింగ్‌పై ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఒక టీమ్.. మ‌రో టీమ్ ప్లేయ‌ర్‌ టాంపరింగ్‌పై ఫిర్యాదు చేయాలంటే ఆ మ్యాచ్ ముగిసిన ఐదు రోజుల్లోపే చేయాల్సి ఉంటుంది. రాజ్‌కోట్ మ్యాచ్ న‌వంబ‌ర్ 13న ముగిసింది. అంటే న‌వంబ‌ర్ 18లోపే ఇంగ్లండ్ దీనిపై ఫిర్యాదు చేయాల్సింది. అలా జ‌ర‌గ‌క‌పోవడంతో కోహ్లిపై ఇప్పుడు ఐసీసీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకొనే అవ‌కాశం లేకుండాపోయింది.

No comments:

Powered by Blogger.