pop

వాట్సాప్‌లో రేప్‌ వీడియోలు


న్యూఢిల్లీ, నవంబరు 21:‌ సామాజిక మాద్యమం వాట్స్‌ప్‌లో అత్యాచారం వీడియోల నియంత్రణపై ఏం చర్యలు తీసుకుంటున్నారో 11 నెలలుగా సమాధానం చెప్పక పోవడంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. జస్టిస్‌ ఎం.బీ.లోకూర్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించింది. సైబర్‌ నేరాల కేసుల దర్యాప్తుకు సంబంధించి స్పష్టమైన విధి విధానాలు రూపొందించక పోవడాన్ని కూడా కోర్టు తప్పు పట్టింది. దీనిపై వారం రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అత్యాచార దృశ్యాలు విచ్చలవిడిగా సామాజిక మాథ్యమంలో ప్రచారం కావడంపై హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘ప్రజ్వల’ గతంలో సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. ఆ లేఖతో పాటు వాట్స్‌ప్‌లో ప్రచారంలో ఉన్న రెండు అత్యాచార దృశ్యాలను కూడా పెన్‌డ్రైవ్‌లో అప్పుడు చీఫ్‌ జస్టీస్‌గా ఉన్న హెచ్‌ఎల్‌ దత్తూకు పంపించింది. ఆ లేఖను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు, కేసు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. అదే విధంగా ఆ తరహా వీడియోలు సామాజిక మాథ్యమాల్లో సర్క్యులేట్‌ కాకుండా ఎలా నియంత్రించవచ్చో చూడాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖను నిర్దేశించింది.

No comments:

Powered by Blogger.