pop

‘ఆనంది’కీ వేధింపులు తప్పలేదా?!


హైదరాబాద్‌: చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌లో ‘ఆనంది’గా అందరికీ సుపరిచితురాలై వివిధ సినిమాల్లో కథానాయికగా మెప్పించిన నటి అవికా గోర్‌. ఆమెకు ఓ టాలీవుడ్‌ యువ నటుడు వాట్సాప్‌లో అమర్యాదకరమైన సందేశాలు పంపినట్లు సమాచారం. యువ నటీనటులకు చెందిన ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో అవికా కూడా ఉన్నారట. అయితే వూహించని ఓ సంఘటన కారణంగా ఆమెను ఆ గ్రూప్‌నుంచి తీసేశారట. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అవికా తెలుగులో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏమాత్రం సుముఖంగా లేనట్లు సమాచారం. అందుకు తోటి నటీనటుల నుంచి మద్దతు కొరవడడమే కారణమని భావిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఓ యువ నటుడు అవికాకు వాట్సాప్‌లో అమర్యాదకరమైన మెసేజ్‌లు పంపాడు. దీంతో కోపం తెచ్చుకున్న అవికా.. అతనితో జరిగిన చాట్‌ సంభాషణని స్క్రీన్‌షాట్‌ తీసి నిఖిల్‌, రాజ్‌తరుణ్‌, సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, హెబ్బాపటేల్‌ తదితరులంతా సభ్యులుగా ఉన్న గ్రూప్‌లో పోస్ట్‌ చేసింది. ఇది నటీనటుల మధ్య పెద్ద చర్చకు తెర తీసింది. వీరిలో రకుల్‌, సాయిధరమ్‌తేజ్‌, హెబ్బా తదితరులు అవికాకు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు నటుడికి మద్దతుగా నిలిచారట.

No comments:

Powered by Blogger.