pop

తల్లిదండ్రులయ్యాక అన్నీ మారిపోతాయి


ఈ మధ్య చాలా మంది సినీనటులు తల్లిదండ్రులుగా ప్రమోషన్లు అందుకుంటున్నారు. తల్లిదండ్రులుగా ఎలా ఉండాలన్న దానిపై పలువురి వద్ద నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అభిషేక్‌ బచ్చన్‌కి మాత్రం ఎవరి సలహాలు అక్కర్లేదని.. తండ్రి అయిన తర్వాత అవే తెలుస్తాయని అంటున్నాడు. అభిషేక్‌ బచ్చన్‌.. ఐశ్వర్యరాయ్‌ గారాలపట్టి ఆరాధ్య ఇటీవలే 5వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా అభిషేక్‌ పితృత్వం గురించి మాట్లాడుతూ.. ‘‘తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెప్పడానికి.. సలహాలు ఇవ్వడానికి బయట చాలా మంది ఉంటారు. కానీ పిల్లలు పుట్టాక ఎవరికి వారే పితృత్వం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. తల్లిదండ్రులుగా మారిన తర్వాత జీవితంలో అన్నీ మారిపోతాయి. నాలో.. ఐశ్వర్యలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు మా లోకమంతా ఆరాధ్యే’’ అని చెప్పాడు అభి.

No comments:

Powered by Blogger.