pop

ఏటీఎంకూ పందిపిల్లను తీసుకెళ్లిన రవిబాబు!


ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం. ఏ సందర్భాన్నైనా తమ పబ్లిసిటీకి వాడేసుకుని ప్రయోజనం పొందుతుంటారు సినీ జనాలు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌ సినిమాలు తీస్తూ విభిన్నమైన పబ్లిసిటీ చేస్తుంటాడు క్రియేటివ్‌ డైరెక్టర్‌ రవిబాబు. ఆ మధ్య ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమానికి కూడా పందిపిల్లతో వచ్చాడు. ఇప్పుడు తన పంది పిల్లను ప్రమోట్‌ చేసుకోవడానికి మరో సందర్భాన్ని వాడుకున్నాడు. ప్రస్తుతం అందరూ తమ పనులను పక్కనబెట్టి పెద్ద నోట్లను మార్చుకోవడానికి ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు నిలబడుతున్నారు. అందుకే అక్కడికే తన పంది పిల్లను వెంటబెట్టుకుని వెళ్లి వినూత్నంగా పబ్లిసిటీ చేశాడు రవిబాబు. చేతిలో పందిపిల్లను పెట్టుకుని ఏటీఎం క్యూలైన్‌లో నిల్చున్నాడు. రవిబాబులాంటి సెలబ్రిటీ.. ఏటీఎం ముందు నిల్చోవడమంటేనే ఆశ్చర్యం. అలాంటిది పందిపిల్లను కూడా పట్టుకుని నిలబడడం మరింత షాక్‌నిచ్చింది అక్కడివారికి. రవిబాబు ప్రస్తుతం పందిపిల్ల లీడ్‌రోల్‌తో ‘అదిగో’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

No comments:

Powered by Blogger.