దిల్లీ : పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు బిగ్‌బజార్ ముందుకు వచ్చింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో దేశవ్యాప్తంగా వున్న 258 బిగ్‌బజార్ స్టోర్స్‌లో రూ.2000 వరకు విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు బిగ్‌బజార్ వర్గాలు తెలిపాయి. తమ అకౌంట్లలో నగదు వుండి విత్‌డ్రా చేయాలనుకునేవారు సమీప బిగ్‌బజార్‌కు వెళ్లి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటర్‌లో కార్డు స్వైప్ చేసి రూ.2000 పొందవచ్చు. ఆర్‌బీఐ, బ్యాంకుల నిబంధనల మేరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని బిగ్‌బజార్ వర్గాలు వెల్లడించాయి. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది ఉపకరిస్తుందని వారు తెలిపారు.
బిగ్‌బజార్‌లోనూ క్యాష్ విత్‌డ్రా
Reviewed by
Unknown
on
10:04
Rating:
5
No comments: