pop

అవును వ్యభిచారం చేస్తున్నా, మీకేంటి: రష్మీ


అవును వ్యభిచారం చేస్తున్నా, మీకేంటి: రష్మీరష్మీ గౌతమ్.. బుల్లితెర ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. ‘జబర్దస్త్ కామెడీ షో’లో యాంకర్ గా పనిచేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న రష్మీ ఈ మధ్యనే వెండితెరపై అడుగుపెట్టింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించిన రష్మీ, ఆ సినిమాలో అందాల ఆరబోతకు వెనుకాడకుండా చేసింది. అంతే కాకుండా ‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్ తో ఎఫైర్లు ఉన్నట్లు ఎన్నోసార్లు పుకార్లు వచ్చాయి. అయితే వారిద్దరి మధ్య ఏమి లేదని ఇద్దరు బహిరంగంగానే చెప్పారు. రష్మీ పేరు అటు సోషల్ మీడియాలో ఇటు వార్తల్లో నిత్యం నిలుస్తూనే వుంది. అంతే కాకుండా ‘నా మీద ఎన్ని పుకార్లయినా రాసుకోండి’ అని రష్మినే బహిరంగంగా చెప్పటం గమనార్హం. అయితే ఈ మధ్య ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ‘వ్యభిచారం కేసులో పట్టుబడిన రష్మీ’ ఈ వార్త చూసిన రష్మీ ఒక్కసారిగా కంగుతిందంట. అయితే ఒక ఛానెల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో మీరు వ్యభిచారం చేసారంట నిజమేనా అని అడిగిన ప్రశ్నకి చిర్రెత్తిన రష్మీ మాట్లాడుతూ “అవును వ్యభిచారం చేస్తున్నా, మీకేంటి?” అని ఎదురు ప్రశ్నించింది. అలా అంటూనే తన గురించి గాసిప్స్ రాయమన్నాను కానీ మరీ ఇంత చీప్ గా కాదు అని సున్నితంగా చెప్పింది. సాధారణంగా సెలబ్రెటీల మీద రూమర్లు రాయటానికి సోషల్ మీడియా వాళ్ళకి పెద్దగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి చెబితే ఇలానే ఉంటుందని పాపం రష్మీకి తెలియదేమో..?

No comments:

Powered by Blogger.