pop

ఈ అబ్బాయ్ కనిపించాడా ....కనిపిస్తే తెలియచేయండి


హైదరాబాద్: చిరిగిన బట్టలు.. ఒంటిపై అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు.. అయ్యా, అమ్మా అంటూ వేడుకోలు... అడుక్కోవడానికి వాళ్లకు ఈ మాత్రం క్వాలిఫికేషన్ ఉండాలి. నగరంలో ఎక్కడ చూసినా బెగ్గింగ్ మాఫియా హల్‌చల్ చేస్తోంది. చూడచక్కనైన చిన్నారులను కూడా ‘ముష్టి’ కోసం కుష్టురోగం వచ్చిన వాళ్లలా మారుస్తున్నారు. వాళ్లను కనకపోయినా కడుపుకు కట్టుకొని వాళ్ల పేరుతో అడుక్కుంటున్నారు. అనాథలైన పిల్లలను, తప్పిపోయి ఆచూకీ తెలియని చిన్నారులను పట్టుకుపోయి చిత్రహింసలు పెట్టి బిచ్చగాళ్లుగా మారుస్తున్నారు. వాళ్ల చేతుల్లో చిప్ప పెట్టి.. ‘ముష్టి’ కోసం మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌లో ఓ బాలుడి ఫొటో వైరల్ అవుతోంది. ఒంటిమీద బట్టలు లేని ఆ బాలుడిని ఓ స్థంభానికి కట్టేసి చిత్రహింసలు పెడుతున్న దృశ్యాలను ‘తెలంగాణ’ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు ఏపీ బాలహక్కుల సంఘం వారిదాక వెళ్లడంతో.. డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫొటోలో ఉన్న బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైనా ఈ బాలుడిని చూసినట్లయితే స్థానిక స్టేషన్‌లో తెలియచేయాలని పోలీసులు సూచించారు. బెగ్గింగ్ మాఫియా చేసే ‘ముష్టి’పని వల్ల నిజంగా అడుక్కొనే వారిని కూడా ప్రజలు నమ్మలేకపోతున్నారు. అడుక్కునే వాళ్లు కనిపిస్తేనే అసహ్యించుకుంటున్నారు. ఎవరు మంచివాళ్లో, ఎవరు మాఫియా వాళ్లో తెలియక సాయం చేయాలనుకునే మనసును కూడా చంపేసుకుంటున్నారు.

No comments:

Powered by Blogger.