pop

నేడు కొత్త రూ.500 నోట్ల రాక


Image result for new 500 rupee noteషాపతను రూ. 2000 నోటుకు చిల్లర అడిగితే ఇదివరకటిలా ఉరిమి చూడడు. కూరగాయలు, పాలు తదితర నిత్యావసర వస్తువుల కొనుగోలుకూ కొంత వెసులుబాటు లభిస్తుంది. మొత్తంగా పెద్ద నోట్ల రద్దు మొదలు ఏర్పడ్డ కష్టాలు కొంత మేర తీరనున్నాయి. ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కొత్త రూ.500 నోట్లు బుధవారం తెలుగు రాషా్ట్రలకు చేరనున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2వేల నోటును విడుదల చేసిన ఆర్బీఐ.. ఇప్పటిదాకా తెలుగు రాషా్ట్రలకు రూ. 500ల నోటును విడుదల చేయలేదు. దీంతో అన్ని ప్రాంతాల్లో చిల్లర కోసం జనం నానా కష్టాలు పడుతున్నారు. బ్యాంకుల్లో కూడా చిల్లర లేకపోవడంతో వారూ ఆందోళనలో ఉన్నారు. ఉన్న చిల్లరతో ఎలాగో అలా నెట్టుకు వస్తున్నామని, ఈ నెల 24వ తేదీ వరకే బ్యాంకులను నడపగలుగుతామని, తర్వాత పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్బీఐ అధికారులకు బ్యాంకు అధికారులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీంతో ఆర్బీఐ కొత్తగా ముద్రించిన రూ. 500 కొత్త నోట్లను ఆగమేఘాలపై రెండు రాష్ట్రాలకు పంపేందుకు చర్యలు తీసుకుంది. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఏ సమయంలోనైనా కొత్త రూ. 500 నోట్లు పంపిస్తామని వీటిని తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా బ్యాంకు యాజమాన్యాలకు ఆర్బీఐ మంగళవారం సాయంత్రం వర్తమానం పంపింది. ప్రత్యేక విమానాల ద్వారా ఈ కొత్తనోట్లను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 400 కోట్ల విలువైన కొత్త రూ. 500 నోట్లు రిజర్వుబ్యాంకు పంపిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం కూడా హైదరాబాద్‌లోని రిజర్వుబ్యాంకుకు చేరనుంది. ఇక్కడి నుంచి రెండు రాష్ట్రాల్లోని వివిధ బ్యాంకులకు ఆ నగదు తరలిస్తారు.

No comments:

Powered by Blogger.