pop

ట్రంప్‌ కోపం.. అందుకేనా?


వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ట్రంప్‌.. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచీ వలసదారులపై వ్యతిరేకత కనబరచడం చూస్తూనే ఉన్నాం. ఇంతకీ ట్రంప్‌కి ఇమ్మిగ్రెంట్లపై ఎందుకింత కోపం అన్నదానికి కారణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్రంప్‌ తాత ఫ్రెడ్రిచ్‌ ట్రంప్‌ దక్షిణ జర్మనీలోని బవేరియాలో పుట్టారు. అక్కడి నిబంధనల ప్రకారం పురుషులు టీనేజ్‌లోనే మిలటరీలో చేరాలి. కానీ అందుకు ఫ్రెడ్రిచ్‌ ఒప్పుకోలేదు. దాంతో దేశం నుంచి ఆయన్ని బహిష్కరించాలని స్థానిక అధికార వర్గాలు ఆదేశించాయి. తనని జర్మనీ నుంచి వెళ్లగొట్టవద్దంటూ ఫ్రెడ్రిచ్‌ బవేరియాను పరిపాలించిన యువరాజు లూయిపోల్డ్‌కు లేఖ రాశాడు. ఆ లేఖ ఇప్పుడు జర్మన్‌ పత్రిక బిల్డ్‌లో ప్రచురితమైంది. ఫ్రెడ్రిచ్‌.. యువరాజు లూయిపోల్డ్‌కు కొన్ని పేజీల ఉత్తరం రాస్తూ తనని జర్మనీ నుంచి బహిష్కరించవద్దని వేడుకున్నారు. కానీ అక్కడి కోర్టు అందుకు అంగీకరించలేదు. దాంతో ఫ్రెడ్రిచ్‌ కుటుంబంతో కలిసి 1885లో అమెరికాకి వలసపోయారు. ఇక్కడే ఇమ్మిగ్రెంట్‌గా స్థిరపడిపోయిన ఫ్రెడ్రిచ్‌ రెస్టారెంట్లు నడుపుతూ బతుకుతెరువు సాగించారు. కానీ బిల్డ్‌ పత్రిక ప్రకారం.. ఫ్రెడ్రిచ్‌ తన కుటుంబంతో కలిసి 1901లో స్వస్థలమైన బవేరియాకు వెళ్లారు. కానీ కొన్నాళ్లకే మిలిటరీలో చేరనందుకు అక్కడి ప్రభుత్వం అతనికి బహిష్కరణ నోటీసులు జారీ చేసింది. పౌరసత్వం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో అతను తిరిగి అమెరికాలో ఇమ్మిగ్రెంట్‌గానే ఉండిపోయారు. ఆ కోపంతోనే ఇప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలోని ఇమ్మిగ్రెంట్లను వెళ్లగొట్టాలని చూస్తున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. మూడు మిలియన్ల మంది వలసదారులను అమెరికానుంచి పంపించివేస్తానని ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

No comments:

Powered by Blogger.