pop

కొత్త నోట్ల కోసం ఎస్‌బీఐకి వెళుతున్నారా? మీకో శుభవార్త!

 మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పాత నోట్లు చెల్లక, చిల్లర దొరక్క పడరాని పాట్లు పడ్డారు. అయితే గురువారం ఉదయం నుంచి కొత్త నోట్లు జారీ చేస్తుండటంతో తెల్లవారుజాము నుంచే బ్యాంకుల వద్ద జనం బారులు తీరారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా శని, ఆదివారాలు కూడా బ్యాంకులు పనిచేస్తాయని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ బ్యాంకుకు కొత్త నోట్ల కోసం వెళ్లేవాళ్లకు మరో తీపి కబురందింది. ఉదయం నుంచి రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ ఒక్కరోజు సాయంత్రం 6 గంటల వరకూ నోట్లను ఇస్తామని బ్యాంకు యాజమాన్యం ప్రకటించింది. సాధారణంగా ఎస్‌బీఐ బ్యాంకు సాయంత్రం 4 నుంచి 4.30 లోపు మూతపడుతుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం పనివేళలు పెంచింది. మరో రెండు రోజులు ఈ అదనపు వేళలు వర్తించే అవకాశముంది. దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ బ్రాంచిలన్నింటికీ ఈ అదనపు పనిగంటలు వర్తిస్తాయని ఉన్నతాధికారులు ప్రకటించారు. కస్టమర్లు ఐడెంటిటీ డాక్యుమెంట్‌ను నింపి ఇస్తే కొత్త నోట్లను ఇస్తామని తెలిపింది.

No comments:

Powered by Blogger.