pop

ఆ వయసులో పెళ్లి తప్పే అంటున్న హీరోయిన్‌!


తెలుగు, తమిళ, మలయాళ సినిమా పరిశ్రమల్లో మంచి గుర్తింపు వస్తున్న దశలోనే పెళ్లి చేసుకొని షాకిచ్చింది హీరోయిన్‌ అమలాపాల్‌. ఆపై ఏడాదికే విడాకులు తీసుకుని మరింత పెద్ద షాకిచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు స్పందించింది అమల. విడాకులు తీసుకోవడానికే ఎవరూ పెళ్లి చేసుకోరని, విడాకులు తీసుకోవాలన్న నిర్ణయమే తన జీవితంలో అత్యంత బాధాకరమైన, క్లిష్టమైన నిర్ణయమని చెప్పింది. ‘నేను 18 ఏళ్లకే కథానాయికనయ్యా. 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా. ఏడాది తిరగకముందే విడిపోవాలని నిర్ణయించుకున్నా. ఆ నిర్ణయాలు తీసుకున్నది నేనే. నాకు సలహాలు ఇచ్చేవారెవరూ లేరు. విజయ్‌ను పెళ్లి చేసుకోవడం తప్పా? ఒప్పా? అంటే నేను చెప్పలేను. కానీ, అంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం మాత్రం తప్పేన’ని వెల్లడించింది. అలాగే విజయ్‌ను తాను ఇప్పటికీ ప్రేమిస్తున్నానని, ఎప్పటికీ ప్రేమిస్తానని చెప్పింది.

No comments:

Powered by Blogger.