pop

జియో ఫ్రీ కాదంటూ సోషల్ మీడియాలో వైరల్... నిజం కాదన్న రిలయన్స్


రిలయన్స్ జియో వినియోగదారులు సోషల్ మీడియాలో కనిపించిన ఓ పోస్ట్ చూసి షాకయ్యారు. వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా నిర్దిష్ట కాలపరిమితి వరకూ డేటా సర్వీసులు ఫ్రీ అని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఫేస్‌బుక్, వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ పోస్ట్ వినియోగదారులను డైలమాలో పడేసింది. గందరగోళంలోకి నెట్టేసింది. రిలయన్స్ జియో సిమ్‌ను వాడుతున్న ఓ వినియోగదారుడికి డేటాను ఉపయోగించుకున్నందుకు రిలయన్స్ జియో బిల్లును పంపిందనేది ఆ పోస్ట్ సారాంశం. బిల్లుకు సంబంధించిన కాపీ ఇదిగో అంటూ పోస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఈ పోస్ట్ నిజం కాదని రిలయన్స్ జియో ప్రతినిధులు స్పష్టం చేశారు. కలకత్తాలో ఉంటున్న అయునుద్దిన్ మొండల్‌‌కు బిల్లు పంపినట్లు ఆ పోస్ట్‌లో ఉంది. 550జీబీ వాడుకున్నందుకు గానూ 27వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు ఆ బిల్లులో ఉంది. అయితే ఈ బిల్లు నిజమైందేనా.. లేక ఎవరైనా కావాలని జియో పేరుతో దొంగ బిల్లును సృష్టించారా అనే విషయంపై వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో రిలయన్స్ జియో ప్రతినిధులు స్పందించి ఈ పోస్ట్ నిజం కాదని స్పష్టం చేశారు. బిల్లుపై ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా ఉండటం విశేషం.

No comments:

Powered by Blogger.