pop

టాపర్స్‌ లవ్‌


న్యూఢిల్లీ : అతడు టాపర్‌. ఆమె మోస్ట్‌ టాపర్‌. ఇద్దరు ఒకేసారి సివిల్స్‌ కొట్టారు. ఇప్పుడు ఒక్కటవుతున్నారు. 2015 యూపీఎ్‌ససీ పరీక్షలో టీనా దాబీ ఫస్ట్‌ ర్యాంకర్‌. సెకండ్‌ ర్యాంకు అతర్‌ అమిర్‌- ఉల్‌- షఫీ ఖాన్‌ సొంతమయింది. ‘‘మేం ప్రేమలో పడ్డాం. త్వరలో పెళ్లి చేసుకొంటాం’’ అంటూ ప్రకటించి..టీనా సివిల్స్‌ వర్గాల్లో సంచలనం సృష్టించింది. తొలిచూపులోనే తన ప్రేమలో పడ్డానని షఫీ ఖాన్‌ చెప్పినా, ఎంతో అభినివేశం ఉన్న అద్భుతమైన వ్యక్తిలా కనిపించారంటూ.. తన ప్రియుణ్ణి పొడగ్తలతో ముంచెత్తింది. టీనా (22) ఢిల్లీకి చెందిన ఓ దళిత కుటుంబం నుంచి అత్యున్నత ప్రతిభాశాలిగా ఎదగగా, షఫీ ఖాన్‌ కల్లోల కశ్మీర్‌ నుంచి సివిల్స్‌కు ఎన్నికయ్యారు. ‘‘ఢిల్లీ నార్త్‌ బ్లాక్‌లోని సిబ్బంది-శిక్షణా విభాగంలో ఈ ఏడాది మే 11వ తేదీన మా ట్రైనీల అభినందన సభ జరిగింది. షఫీ ఖాన్‌ అక్కడకొచ్చారు. తొలిచూపులోనే ఒకరికొకరం నచ్చేశాం. ఉదయం మేం కలుసుకొంటే, సాయంత్రానికి షఫీ మా ఇంటికి వచ్చేశారు’’ అని టీనా వివరించింది. తామిద్దరం కలిసి దిగిన ఫొటోలు, సందర్శించిన ప్రదేశాల వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా..ఒక ముస్లింని, అదీ కశ్మీరీ మైనారిటీని ఎలా ఇష్టపడ్డావని కొంతమంది నిరుత్సాహపరిచారని తెలిపింది. తమ సంబంధం, నేపథ్యంపై ఎవరేమనుకొన్నా, స్వతంత్ర ఆలోచన కలిగిన మహిళగా.. తన ఎంపిక పట్ల చాలా సంతోషంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ప్రేమని నిలుపుకోవడం కోసం చిన్న చిన్న త్యాగాలు చేయక తప్పదన్న టీనా, తమ పేర్లు ముడిపెట్టి చేసే వ్యాఖ్యలను, వార్తలను పట్టించుకోవడం మానేశామని పేర్కొంది. తమ కలయికకు ఇరు కుటుంబాల పెద్దల నుంచి పూర్తి ఆమోదం ఉన్నదని టీనా వివరించింది.

No comments:

Powered by Blogger.