pop

రోబో పోలీసులు వచ్చేశాయ్


sanbotరోబో అంటే మనలో చాలామందికి ఒక నెగెటివ్ ఫీలింగ్. కానీ చైనా ప్రజల జీవితంలో రోబోలు ఇప్పుడు భాగం అయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పని చేసే పది రోబోలు ఇటీవలే చైనాలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో డ్యూటీ ఎక్కాయని.. వీటి పని తీరుని బట్టి భవిష్యత్తులో మరిన్ని రోబోలను అపాయింట్ చేస్తామంటున్నారు అక్కడి అధికారులు. కస్టమ్స్ అధికారులు చేసే పనులతో పాటు చుట్టుపక్కల ఏం జరుగుతుందో పసిగట్టి , రికార్డ్ చేయడం ఈ రోబో పోలీసుల బాధ్యత. అందులో సాన్ రోబో అనే రోబో కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. ప్రయాణీకులకు సహాయపడుతూ వాళ్ల ట్రిప్ సాఫీగా సాగేలా చూస్తోంది ఈ రోబో. ఈ రోబో 29 భాషలను అర్థం చేసుకుని మాట్లాడగలదు. ఎయిర్‌పోర్ట్‌లో వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల సందేహాలు తీర్చగలదు. అయితే సమాధానాలు చెప్పలేని సందర్భాల్లో స్థానిక ఆపరేటర్‌కి కనెక్ట్ చేస్తుందట. మైక్రోసాఫ్ట్ కినెక్ట్-ైస్టెల్ ట్రాకింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ రోబోకు హెచ్‌డీ కెమెరాలే కళ్లట. ఎల్‌ఈడీ స్క్రీనే ముఖం. వివిధ భావాలను వ్యక్తపరచడానికి తల భాగంలో హెచ్‌డీ ప్రొజెక్టర్ సెట్ చేశారు. దాంతో పాటు ఛాతి భాగంలో ఒక టచ్‌స్క్రీన్ కంప్యూటర్ ఫిక్స్ చేశారు.

No comments:

Powered by Blogger.