pop

సల్మాన్‌ కుమారుడిని చూశారా?!


ముంబయి: సల్మాన్‌కి పెళ్లే కాలేదు, కొడుకెక్కడినుంచి వచ్చాడంటారా? రియల్‌ లైఫ్‌లో కాదులెండి. ఈ అబ్బాయి పేరు అలీ హాజి. 2007లో సల్లూభాయ్‌ నటించిన పార్ట్‌నర్‌ చిత్రంలో సల్మాన్‌, లారా దత్తాల కుమారుడిగా అలీ నటించాడు. ఇప్పుడు అలీకి 17 ఏళ్లు. తొమ్మిదేళ్ల తర్వాత బిగ్‌బాస్‌ సీజన్‌10 సెట్‌లో రీల్‌ లైఫ్‌ తండ్రీకొడుకులు ఇలా కలుసుకుని సరదాగా గడిపారు. అలీ ఈ ఫొటోలని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్‌ చేస్తూ.. ఎన్ని రోజులైందో అని క్యాప్షన్‌ ఇచ్చాడు. అలీ ‘ఫనా’ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌కి, ‘తారా రమ్‌పమ్‌’ సినిమాలో సైఫ్‌కి కుమారుడిగా నటించాడు.

No comments:

Powered by Blogger.