pop

ఇన్విటేష‌న్ రూపంలో జియో సిమ్‌ల హోం డెలివ‌రీ..!


Jio sims available through home delivery ఉచిత ఇంటర్నెట్, వాయిస్ కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ల వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో సంచనాలు సృష్టిస్తూ తెరంగేట్రం చేసిన రిలయన్స్ జియో సిమ్‌ల కోసం వినియోగదారులు గతంలో పెద్ద ఎత్తున బారులు తీరిన విషయం విదితమే. అయితే ఈ సిమ్‌లు ఇప్పుడు అంత శ్రమ లేకుండానే వినియోగదారులకు లభ్యమవుతున్నాయి. ఈ క్రమంలో వారికి స్టోర్‌కు రావాల్సిన పని లేకుండానే సిమ్‌లు హోం డెలివరీ రూపంలో లభ్యం కానున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఈ విషయంపై అనేక వార్తలు హల్ చల్ చేయగా, ఇప్పుడవి నిజమయ్యాయి. రిలయన్స్ ఇకపై తన జియో సిమ్‌లను హోం డెలివరీ రూపంలోనూ అందించనుంది. అయితే సిమ్‌ల హోం డెలివరీ సౌలభ్యం ఇంకా పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి రాలేదు. దీన్ని ఆ సంస్థ పైలట్ ప్రోగ్రామ్‌గానే ప్రారంభించింది. అంటే కేవలం ఇన్వైట్స్ (ఆహ్వానాలు) అందుకున్న వారికి మాత్రమే ఈ సిమ్‌లు హోం డెలివరీ రూపంలో లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే రిలయన్స్ తాను ఎంపిక చేసిన కొందరు వినియోగదారులకు మాత్రమే జియో సిమ్‌లు హోం డెలివరీ అందిస్తామని చెబుతూ వారికి ఇన్విటేషన్లు పంపుతుంది. ఈ క్రమంలో సదరు వినియోగదారులు సిమ్‌లు కావాలనుకుంటే తమ అడ్రస్, ఇతర సమాచారం, డెలివరీ టైం వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో జియో సిమ్‌లు వారి ఇంటి వద్దకే డెలివరీ అవుతాయి. ప్రస్తుతం ఈ పైలట్ కార్యక్రమం అహ్మదాబాద్, బెంగుళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై, పూణె, విశాఖపట్నం వంటి ఎంపిక చేసిన కొన్ని నగరాల్లోనే ప్రారంభమైంది. అది కూడా రిలయన్స్ ఎంపిక చేసిన కొద్ది మంది యూజర్లకు, అదీ ఇన్విటేషన్ ప్రాతిపదికపై సిమ్‌లు హోం డెలివరీ రూపంలో అందుతాయి. యూజర్లు తాము ఇన్విటేషన్‌ను రిక్వెస్ట్ చేసేందుకు మాత్రం అనుమతి లేదు. రిలయన్సే స్వయంగా యూజర్లను ఎంపిక చేసి వారికి ఆహ్వానాలు పంపుతుంది.

No comments:

Powered by Blogger.