pop

కారుపై దెయ్యం.. చాలా భయం


Image result for real demons and devilsచైనాలో దయ్యాలు నడిరోడ్డుమీదే హల్చల్ చేస్తున్నాయి. ఏ అమావాస్య రోజో, అర్థరాత్రో, మర్రిచెట్టు కిందో కనిపించాల్సిన దెయ్యాలు.. ఏకంగా రోడ్ల మీదకు వచ్చేయడంతో.. చైనీయులు కంగారుపడిపోతున్నారు. చైనాలో ఓ వ్యక్తి అమావాస్య రాత్రి డ్రైవ్ చేస్తున్నాడు. ఎదురుగా కారు అడ్డుగా ఉంది. తప్పుకోవట్లేదు. చేసేది లేక హైబీమ్ లైట్లు ఫోకస్ చేశాడు. అంతే రోడ్డుమీద దయ్యాలు ప్రత్యక్షమై నరకం చూపించాయి. కానీ ఆ దెయ్యాలు నిజం దెయ్యాలు కాదట. హైబీమ్ లైట్ల ముప్పు తప్పించుకోవడానికి చైనా కార్ల యజమానులు అద్దాలపై దెయ్యం స్టిక్కర్లు వేయిస్తున్నారు. అవి చూసి డ్రైవర్లు బెంబేలెత్తిపోతున్నారు. దెయ్యాల సమస్యపై చైనా పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఏ స్టిక్కర్లు వేయించుకున్నా తప్పుకాదంటున్నారు. వాటి వల్ల ప్రమాదాలు జరిగితేనే తాము రంగంలోకి దిగుతామని తేల్చిచెబుతున్నారు

No comments:

Powered by Blogger.