pop

రిలయన్స్‌ నుంచి అపరిమిత కాల్స్‌!


న్యూదిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) తన వినియోగదారుల కోసం అపరిమిత కాల్స్‌ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌కామ్‌ చందాదారులు దీనిని వినియోగించుకోవచ్చు. నెలకు రూ.149 రీఛార్జ్‌ చేయడం ద్వారా దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా కాల్స్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ఆర్‌కామ్‌ ప్రకటన విడుదల చేసింది. ‘రూ.149 అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌ ఆర్‌కామ్‌ 2జీ, 3జీ, 4జీ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్షలమంది ఇంకా 2జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి కొత్త వచ్చే వారికీ ఇది వర్తిస్తుంది. రూ.149 అన్‌లిమిటెడ్‌ రీఛార్జ్‌తో కేవలం అపరిమిత కాల్స్‌ మాత్రమే కాదు.. 300 ఎంబీ డేటాను కూడా వినియోగదారులు పొందవచ్చు’ అని ఆర్‌కామ్‌ తన ప్రకటనలో తెలిపింది.

No comments:

Powered by Blogger.