pop

బాలమురళీకృష్ణంటే ఇష్టమేనట, కానీ...


సంగీత రారాజు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చనిపోయి సంగీత ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోతే ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి వివాదాలను సృష్టించే రామ్‌గోపాల్ వర్మ మాత్రం.. ఆయన మృతి చెందిన ఈ సందర్భాన్ని కూడా వదలకుండా వివాదాన్ని రేపాడు. ఎవరైనా చనిపోతే సానుభూతి తెలుపుతారు, సంతాపం ప్రకటిస్తారు.. కానీ, అతడు మాత్రం బాలమురళీకృష్ణపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను చిన్నప్పట్నుంచి బాచ్, బీతోవెన్, మోజర్ట్ సంగీతం వింటూ పెరిగాను. కర్ణాటక సంగీతం అంటే నాకు అస్సలు గిట్టదు. కానీ, నాకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అంటే ఇష్టం. ఎందుకంటే.. ఆయనెప్పుడూ దానికి ఏం చేయనందుకు నాకు ఇష్టం. రిప్’’ అంటూ ట్వీట్ చేశాడు. అతడి ట్వీట్‌పై నెటిజన్లు, సంగీత ప్రియులు మండిపడ్డారు. ఒకవేళ ఆయన ఏం చేసి ఉండకపోతే అంతమంది ఎందుకు ఆయన్ను అభిమానిస్తారు? ఇష్టపడతారు అంటూ వర్మపై ఆన్‌లైన్‌లో మండిపడుతున్నారు బాలమురళీకృష్ణ అభిమానులు.

No comments:

Powered by Blogger.