pop

చెన్నై శ్మశానవాటికలో వైఫై సేవలు.. ఇకపై అంత్యక్రియలు లైవ్‌లో...


WifiWifi అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు శ్మశానవాటికలకు కూడా చేరువైంది. మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చే బంధుమిత్రులకు శ్మశానవాటిక ఉన్న ప్రాంతం గురించి, అంత్యక్రియల గురించి సమాచారం అందించాలన్నా, ఎవరైనా విదేశాల్లో ఉండి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాలేకపోయినా వారికి లైవ్‌లో అంత్యక్రియల కార్యక్రమం చూసేలా ప్రత్యక్షప్రసారం చేసేందుకు వీలుగా శ్మశానవాటికలో మొట్టమొదటిసారి వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ ఇలాంటి శ్మశానం ఎక్కడుందనే కదా మీ సందేహం. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన వేలగంపాడు శ్మశానవాటికలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ శ్మశానవాటిక నిర్వహణ బాధ్యతలను ఇండియన్ కమ్యూనిటీ వెల్పేర్ ఆర్గనైజేషన్‌కు చెన్నై నగర పాలక సంస్థ అప్పగించింది. దీంతో ఈ సంస్థ ఇక్కడ వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చింది. శ్మశానవాటికలో వైఫై సౌకర్యం ఏర్పాటు వల్ల తమకు ఆదరణ పెరిగిందని సంఘం వ్యవస్థాపక కార్యదర్శి హరిహరన్ అంటున్నారు.

No comments:

Powered by Blogger.