pop

పాపం తారా.. తెల్లబోయారిలా!


ముంబయి: బ్రిటిష్‌ నటి తారా శర్మ ఇటీవల బాలీవుడ్‌ నటులు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌ల కుమార్తె ఆరాధ్య పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. ఆ రోజు బచ్చన్‌ కుటుంబంతో సరదాగా సమయాన్ని గడిపిన ఆమె తర్వాత అభిషేక్‌ బచ్చన్‌కు ట్వీట్‌ చేశారు. ‘చక్కటి పార్టీ ఇచ్చినందుకు జూనియర్‌ బచ్చన్‌, ఐష్‌కు ధన్యవాదాలు. మనమంతా చాలా సరదాగా సమయాన్ని గడిపాం. అక్కడి నుంచి రావాలి అనిపించలేదు! లిటిల్‌ ప్రిన్సెస్‌కి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తారా ట్వీట్‌ చేశారు. ఆమె ట్వీట్‌ మొత్తం బానే ఉంది కానీ.. అభిషేక్‌ ఒరిజినల్‌ అకౌంట్‌కి ట్యాగ్‌ చేయాల్సింది పొరపాటున అదే పేరుతో ఉన్న ఫేక్‌ అకౌంట్‌కి ట్యాగ్‌ చేశారు. దీంతో మొదలైంది అసలైన కామెడీ. దీనికి అభిషేక్‌ ఫేక్‌ అకౌంట్‌ వ్యక్తి వూహించని విధంగా రిప్లై ఇచ్చారు. ‘థ్యాంక్స్‌ తారా! మనమిద్దరం చాలా బాగా సమయాన్ని గడిపాం. ఈసారి దయచేసి తక్కువ తాగు.. దాంతో ఎవరిని ట్యాగ్‌ చేయాలో సరిగ్గా తెలుస్తుంది. నువ్వు ఇలా ట్వీట్‌ చేయడం రెండోసారి’ అని ఆ వ్యక్తి బదులిచ్చారు. వూహించని ఆ సమాధానం చూసి తారాశర్మ తెల్లబోయి ఉంటారు కదూ!

No comments:

Powered by Blogger.