pop

బర్త్‌డే పార్టీలో రెచ్చిపోయిన యాంకర్‌ శ్యామల!


ప్రస్తుతం బుల్లితెర నటులకు కూడా సూపర్‌ పాపులారిటీ దక్కుతోంది. బుల్లితెర యాంకర్లు రష్మీ, అనసూయ, శ్రీముఖి వంటివారు గ్లామర్‌ క్వీన్‌లుగా వెలిగిపోతున్నారు. కేవలం యాంకరింగ్‌ మాత్రమే కాకుండా సినిమా ఆడియో ఫంక్షన్లలో హోస్టులుగానూ, సినిమా తారలుగానూ వెలిగిపోతున్నారు. అయితే వీరికి కొంచెం భిన్నంగా ఉంటుంది శ్యామల. ఎక్కవగా చీరల్లోనే దర్శనమిస్తూ గ్లామర్‌ షోకు కాస్త దూరంగా ఉంటుంది. కాస్త హుందాగా, తెలుగుదనంతో యాంకరింగ్‌ చేస్తుంది. అయితే రీసెంట్‌గా జరిగిన తన బర్త్‌డే పార్టీలో మాత్రం శ్యామల గేర్‌ మార్చేసింది. వెస్ట్రన్‌ స్టైల్లో గ్రాండ్‌గా బర్త్‌డే చేసుకుంది. అతిథులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈ సారి తన బర్త్‌డే గ్రాండ్‌గా జరిగిందని, ఈ పుట్టినరోజును జీవితంలో మర్చిపోలేనని తెలిపింది శ్యామల. బర్త్‌డే ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

No comments:

Powered by Blogger.