pop

బాయ్‌ఫ్రెండ్‌.. ఇలా కూడా ఉంటాడా?


ఇంటర్నెట్‌డెస్క్‌: తన సరదా కోసం హాయిగా నిద్రపోతున్న ప్రేయసిపై రెండు పాములను వదిలాడు ఓ యువకుడు. ప్రియురాలిని అపురూపంగా చూసుకోవాల్సింది పోయి ఇలా భయపెడితే ఏ యువతైనా ఎలా ప్రేమిస్తుంది? డెరెక్‌ డెసో అనే వ్యక్తి తన స్నేహితులందరితో కలిసి ప్రేయసిని సరదాగా ఆట పట్టించాలనుకున్నాడు. ఆమె ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా డెరెక్‌ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె వద్దకు వెళ్లాడు. ఓ అట్టపెట్టెలో రెండు కొండచిలువలను తెచ్చి వాటిని నిద్రిస్తున్న యువతిపై వదిలాడు. ఉలిక్కిపడి నిద్ర లేచిన ఆమెకు పాముల్ని చూసేసరికి గుండె ఆగినంత పనైంది. ఆమె హడలిపోతూ వాటిని తీయమని కేకలు పెడుతుంటే ఆమె ప్రియుడు, అతని స్నేహితులు మాత్రం నవ్వుతూ ఆనందించారు. కాసేపటి తర్వాత వారే కొండచిలువలను తొలగించారు. ఏదో సరదాగా చేశానని డెరెక్‌ ప్రేయసిని బుజ్జగించబోయినా ఆమె మాత్రం కోపంతో అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోని డెరెక్‌ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. కొందరు సరదాగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తే మరికొందరు ఇలాంటి శాడిజం ఉండకూడదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే వరస్ట్‌ బాయ్‌ఫ్రెండ్‌ అంటూ కొందరు అతనికి బిరుదు ఇచ్చారు.

No comments:

Powered by Blogger.