pop

పాలు వద్దంటున్నారు ... బీరు తాగమంటున్నారు-Say No To Milk, Yes To Beer – PETA


మీరు విన్నది నిజమేనండి. పాలు వద్దు .. బీరు తాగమంటున్నారు. అప్పుడెప్పుడో 2000 సంవత్సరం సమయంలో జంతు సంరక్షణ సంస్థ పెటా, బీరు తాగండి, పాలు మానండి అంటూ ప్రచారం చేసింది గుర్తుందా? అప్పుడే చాలామంది ఈ ప్రచారానికి నెగెటివ్ గా స్పందించే సరికి అప్పుడు ఆ క్యాంపెన్ మానేసింది పెటా. ఇప్పుడు మళ్ళీ అదే ముచ్చట మొదలుపెట్టింది. పదిహేను సంవత్సరాల తరువాత మళ్ళీ పాలు వద్దంటోది పెటా. ఇలా ఎందుకు అంటే, కారణం మీకు తెలియనిది కాదు. పాల కోసం జంతువులని హింసిస్తున్నారని, పసి పశువులకి తల్లి పశువులు సరిగా పాలు పట్టలేకపోతున్నాయని వాదిస్తోంది పెటా. ఇంతమాత్రమే కాదు, పాల కన్నా బీరే ఆరోగ్యకరమని, తమ దగ్గర ఈ విషయాన్ని రుజువు చేసే సైంటిఫిక్ ఆధారాలున్నాయని చెబుతున్నారు పెటా వారు. యూఎస్ లోని విస్కాన్సిన్ యూనివర్సిటీ దగ్గరలో ఓ బిల్ బోర్డ్ ని ఏర్పాటు చేసింది ఈ సంస్థ. ఆ బోర్డ్ లోనే బీరు తాగమని, పాల కన్నా బీరు ఆరోగ్యకరమని పేర్కొంది. బీర్ లోని గుణాలు ఎముకలని పటిష్టం చేస్తాయని, అదే పాల వలన ఎముకలు బలహీనమవుతాయని చెబుతోంది పెటా. అంతేకాదు, పాల వలన డయాబెటిస్, క్యాన్సర్, ఒబేసిటి లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. పెటా కార్యవర్గ ఉపాధ్యాక్షుడు ట్రేసీ రీమాన్ మాట్లాడుతూ మీతంగా తాగితే ఆల్కహాల్ చాలా మంచిదని, బీరు వదిలేసి లక్షలకొద్దీ ఆవులను ఇబ్బంది పెడుతూ పాలు తాగవద్దని చెప్పుకొచ్చాడు

No comments:

Powered by Blogger.