pop

ట్రంప్ గురించి పెద్దగా తెలియని మరో అంశం


ట్రంప్ గురించి పెద్దగా తెలియని మరో అంశంన్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఊహించని రీతిలో విజయాన్ని సాధించి అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్న బడా బిజినెస్ మేన్ డోనాల్డ్ ట్రంప్. ఆయన మాటలు, ఆలోచనలే కాదు చేతలు కూడా ఆసక్తికరమే. ఆయన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించినప్పుడు ఈ అంశం తెలుస్తోంది. ఆయన ఓ మొండివాడని ఎదుటివారికి నచ్చినా నచ్చకపోయినా అనుకుంది చేసుకుంటూ పోయేతత్వం అని మరోసారి స్పష్టం అవుతుంది. 1946 జూన్ 14న న్యూయార్క్ శివారులోని క్వీన్స్ లో జన్మించిన ట్రంప్ పుట్టుకతోనే శ్రీమంతుడు. తండ్రి వ్యాపారాన్ని చేతిలోకి తీసుకొని అందులో దూకుడుగా వ్యవహరిస్తూనే వ్యక్తిగత అభిరుచులు కూడా కొనసాగించాడు. కాస్తంత గందరగోళ వ్యక్తిగా కనిపించే ట్రంప్ కు నటనపై అమితమైన ఆసక్తి అని ఆయన చరిత్ర గమనిస్తే తెలుస్తోంది. ఆయన ఇప్పటి వరకు పలు సినిమాల్లో టీవీ షోల్లో నటించారు. అయితే, అన్నింటిలో కూడా దాదాపు బిజినెస్ మేన్ గా.. సంపన్న తండ్రిగా నటించాడు. ఇప్పట వరకు ఆయన 14 టీవీ షోల్లో, 12 సినిమాల్లో నటించారు. మొట్టమొదటిసారి ది జెఫర్ సన్స్ అనే టీవీ షోలో 1985లో నటించిన ట్రంప్.. సినిమాల్లోకి మాత్రం 1989లో గోస్ట్ కాంట్ డు ఇట్ అనే చిత్రం ద్వారా అడుగుపెట్టారు. 2010లో వచ్చిన వాల్ స్ట్రీట్:మనీ నెవర్ స్లీప్స్ అనే చిత్రంలో ట్రంప్ నటించినప్పటికీ థియేటర్ వర్షన్ లో ఆయన నటించిన విభాగాన్ని తొలగించారు. అయితే, డీవీడిలో మాత్రం అలాగే ఉంచారు. సినిమాల్లో నటనపై ఆసక్తి కనబరిచిన ట్రంప్ తన నటనను మాత్రం వృద్ధి చేసుకోలేకపోయారని.. ప్రేక్షకులను మెప్పించలేకపోయారని పలు మేగిజిన్లు వెల్లడించాయి. ఒక చిత్రంలో ట్రంప్ మాంత్రికుడిగా కూడా నటించారట. ట్రంప్ కు ఒక్క అవార్డుగానీ, గుర్తింపుగానీ
రాకపోవడం గమనార్హం

No comments:

Powered by Blogger.