pop

భాగస్వాముల వయసులో ఎంత తేడా ఉండాలి ?-What Should Be The Age Gap Between Life Partners ?


Age Gap Divorce Life Partners Marriage Sexual Desires What Should Be The Between ? Photo,Image,Pics- సాధారణంగా అబ్బాయి వయసులో పెద్దగా, అమ్మాయి వయసులో చిన్నగా ఉండే జంటలనే చూస్తుంటాం. వయసులో ఎవరు పెద్దగా ఉన్నా, వయసులో ఉండే గ్యాప్ పై మాత్రం కొంత అవగాహన ఉండటం చాలా అవసరం. భాగాస్వాములు అంటే కలిసి ఓ 50-60 సంవత్సరాలైనా జీవించాలి కదా. అలాంటప్పుడు ఇద్దరి ఆలోచనా విధానం ఒకేలా ఉంటే మంచిది. ఏజ్ గ్యాప్ పెరిగినా కొద్ది, ఇద్దరి ఆలోచనలు కలిసే అవకాశం కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు. భాగస్వాముల మధ్య 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే విడాకులు తీసుకునే అవకాశం 90 శాతానికి పైగానే ఉంటుందట. అదే 10 ఏళ్ల దాకా ఉంటే విడాకులు తీసుకునే అవకాశం 40% దాకా ఉంటుందట. ఇక 5 ఏళ్ల గ్యాప్ ఉంటే విడాకులు తీసుకునే శాతం 15 కి పడిపోతుందట. దీని వెనుక లాజిక్ చాలా సింపుల్. మన ఆలోచనావిధానం, మన తమ్ముడు లేదా, చెల్లి ఆలోచనా విధానం ఒకేలా ఉండదు కదా. కాబట్టి జీవిత భాగస్వాముల వయసులో ఎంత తక్కువ వ్యత్యాసం ఉంటే అంత మంచిది. లేదంటే మానసికంగానే కాదు, శారీరకంగాను ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఎందుకంటే, సెక్స్ కోరికలు వయసుతో పాటు మారుతూ ఉంటాయి. అలాగని వయసులో తేడా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా సమస్యలు వస్తాయని చెప్పట్లేదు. కాని అవకాశం ఎక్కువ. వయసులో వ్యత్యాసంతో సంబంధం లేకుండా మానసికంగా, శారీరకంగా సుఖంగా ఉంటున్న జంటలు లేకపోలేదు.

No comments:

Powered by Blogger.